తెలంగాణ

telangana

ETV Bharat / international

'నిజాం నిధుల కేసులో పాకిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ' - నిజాం నిధుల కేసు కోర్టు ఖర్చులు భారత్​కు చెల్లించండి

నిజాం నిధుల కేసు విషయంలో పాకిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ నిధుల కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పు వెలువరించిన లండన్ కోర్టు.. తాజాగా పాకిస్థాన్​కు షాక్ ఇచ్చింది. ఈ కేసులో భారత్​కు అయిన ఖర్చులు చెల్లించాలని పాక్​ను ఆదేశించింది.

Britain high court ordered Pakistan to pay nizam property case expenses to India
నిజాం నిధుల కేసు కోర్టు ఖర్చులు భారత్​కు చెల్లించండి

By

Published : Dec 20, 2019, 6:58 AM IST

Updated : Dec 20, 2019, 7:09 AM IST

హైదరాబాద్​ నిజాం లండన్​లోని ఒక బ్యాంకులో దేశ విభజన సమయంలో డిపాజిట్​ చేసిన నిధులపై దశాబ్దాలపాటు నలిగిన వివాదాన్ని పరిష్కరించి భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బ్రిటన్ హైకోర్టు, ఈ వ్యాజ్యంలో భారత్​కు అనుకూలంగా మరో తీర్పు ఇచ్చింది.

ఈ వ్యాజ్యానికి సంబంధించి కోర్టు ఖర్చుల్లో 65 శాతం మేర చెల్లించాలని పాకిస్థాన్​కు ఆదేశించింది. అంటే భారత్​కు సుమారు రూ. 25.78 కోట్లు పాకిస్థాన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నిష్పత్తిలో నిజాం వారసులకు కూడా చెల్లించాలి. నిజాంకు చెందిన దాదాపు 35 మిలియన్ పౌండ్లు లండన్​లోని న్యాట్​ వెస్ట్ బ్యాంకులో మూలుగుతున్నాయి. వీటిపై తమకు హక్కు కల్పించాలని పాకిస్థాన్​ దావా వేసింది. అయితే నిజాం వారసులు ప్రిన్స్​ ముఖరమ్​ ఝా తదితరులు భారత్​తో చేయికలిపి పాకిస్థాన్​కు వ్యతిరేకంగా వ్యాజ్యం నడిపారు. ఈ దావాను విచారించిన బ్రిటన్ హైకోర్టు భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో భారత్​కు కోర్టు ఖర్చులు చెల్లించమని పాకిస్థాన్​కు ఆదేశించింది.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​లో నేడు తుదిదశ ఎన్నికలు.. 7గంటలకు పోలింగ్

Last Updated : Dec 20, 2019, 7:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details