ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ఎన్నికల చివరి అంకం నేడే - Fifth and last phase Elections in Jharkhand

ఝార్ఖండ్​లో నేడు ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 16 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్​.. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే ముగియనుంది. మరికొన్ని ప్రాంతాల్లో 5 గంటల వరకూ కొనసాగనుంది. ఝార్ఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​తో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Fifth and last phase Elections in Jharkhand
ఝార్ఖండ్​లో నేడు చివరిదశ పోలింగ్​.. 7గంటలకు పోలింగ్
author img

By

Published : Dec 20, 2019, 5:48 AM IST

Updated : Dec 20, 2019, 7:21 AM IST

చివరిదశ పోలింగ్​కు ఝార్ఖండ్​లో సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు నాలుగు విడతలు పోలింగ్​ జరగగా ఐదో విడతలో భాగంగా ఇవాళ 16 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 40,05,287 మంది ఓటర్లు.. రాజకీయ నేతల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభం కానుంది. బోరియో, బర్​హెట్​, లితిపార, మహేశ్​​పుర, శికారిపారలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి X మంత్రి

ఝార్ఖండ్​ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం ప్రముఖ నేత హేమంత్​ సోరెన్​తో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దుమ్​కా, బర్​హెట్ రెండు స్థానాల్లో సోరెన్​ ఎన్నికల బరిలో నిలవగా.. ​దుమ్​కాలో సోరెన్​కు పోటీగా భాజపా మహిళా నేత, శిశు సంక్షేమశాఖ మంత్రి లూయిస్​ మరాండీ బరిలోకి దిగుతున్నారు. ఫలితంగా అక్కడ ఆయనకు గట్టి పోటీ తప్పేలా లేదు. మరో భాజపా నేత, ఝార్ఖండ్​ వ్యవసాయశాఖ మంత్రి రాన్​ధిర్​ సింగ్​.. శరత్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

81 స్థానాలు.. 5 విడతలు

ఝార్ఖండ్​లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 16 వరకు నాలుగు విడతలుగా ఇప్పటికే 65 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 16 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరగనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOUSE TV - AP CLIENTS ONLY
Washington DC - 19 December 2019
++GRAPHICS AT SOURCE++
1. Wide of representatives voting
2. Final vote tally
3. UPSOUND (English) result of vote being read out by US Democratic Representative Mikie Sherrill:
"On this vote the yays are 385 and the nays are 41. The bill is passed."
4. Wide of House
STORYLINE:
One day after its historic impeachment votes, the Democratic-led House gave President Donald Trump an overwhelming bipartisan victory on a renegotiated trade agreement with Canada and Mexico.
By a 385-41 vote, the House approved a bill that puts in place terms of the United States-Mexico-Canada Agreement on Thursday.
The legislation passed after House Speaker Nancy Pelosi, D-Calif., and her colleagues won key concessions from an administration anxious to pass the trade deal before next year’s election season makes that task more difficult.
The deal is projected to have only a modest impact on the economy.
But it gives lawmakers from both parties the chance to support an agreement sought by farmers, ranchers and business owners anxious to move past the months of trade tensions that have complicated spending and hiring decisions.
The GOP-controlled Senate probably will take up the legislation when members return to Washington after the holidays and after dealing with impeachment.
Trump made tearing up the North American Free Trade Agreement a hallmark of his presidential run in 2016 as he tried to win over working-class voters in states such as Michigan, Ohio, Wisconsin and Pennsylvania.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 20, 2019, 7:21 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.