పపువా న్యూగినియాలో చార్టర్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం హైజాక్‌కు గురైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. విమానం ఇంధనం నింపుకోవడానికి ఆగిన సమయంలో ఆయుధాలు ధరించిన వ్యక్తులు లోపలికి చొరబడి విమానాన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లేలా పైలట్‌ను హెచ్చరించినట్లు తెలిపింది. ఉపయోగంలో లేని ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్ అయి, పరారైనట్లు వివరించింది.
విమానం హైజాక్- లగేజీ దొంగలించి పరార్ - papua new guinea
పపువా న్యుగినియాలో విమానం హైజాక్‌కు గురైంది. ఇదేదో మనుషుల్ని భయపెట్టి, ప్రభుత్వాలను మభ్యపెట్టడానికి ఉగ్రమూకలు చేసిన పని కాదండోయ్. కేవలం విమానంలోని లగేజీని దొంగలించడానికి చేసిన పని.
విమానం హైజాక్- లగేజీ దొంగలించి పరార్
"విమానాన్ని గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత లోపల ఉన్న వస్తువులు, సరుకులను దొంగలించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. పైలట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు."
-మాథ్యూ బ్రట్నాల్, విమాన సంస్థ ప్రతినిధి
హైజాక్ జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. అనంతరం విమానం పోర్ట్ మోర్స్‌బై ప్రాంతానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాయల్ పపువా న్యూగినియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.