8 వరుస బాంబు పేలుళ్లతో ఆదివారం శ్రీలంక దద్దరిల్లింది. జనజీవనం స్తంభించింది. పేలుళ్లకు దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 450 మందిపైగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆదివారం నాటి ఘటన ఆ దేశ పర్యటక రంగంపైన భారీ ప్రభావం చూపే అవకాశముంది.
2018 నవంబరులో ఈ రంగం నుంచి రూ. 36 కోట్ల 27 లక్షలు అర్జించింది శ్రీలంక. గతేడాది సుమారు 23 లక్షల మంది విదేశీయులు లంకలో పర్యటించారు. పేలుళ్ల ఘటనతో వారి సంఖ్య భారీగా తగ్గిపోతుందని పర్యటక రంగంపై ఆధారపడ్డవారు ఆవేదన వ్యక్తం చేశారు.