పాకిస్థాన్ కరాచీలో విషవాయు లీకేజీ ఐదుగురు ప్రాణాలను బలిగొంది. పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం పాలయ్యేందుకు కారణమైంది.
కరాచీ పోర్టుకు అతి సమీపంలోని కమరి ప్రాంతంలో గత రాత్రి విషవాయువు లీకైంది. అక్కడి ప్రజలు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రులకు పరుగులు తీశారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు.
"కళ్లు, ఛాతీలో తీవ్ర మంటతో బాధపడ్డా. గుండె వేగంగా కొట్టుకుంది. ఆస్పత్రిలో చేరా. తర్వాత కొంచెం తగ్గింది. ఇదే ఇబ్బంది నా కుమారుడికీ ఎదురైంది. అతడ్ని వెంటనే ఆస్పత్రిలో చేర్చా. ప్రస్తుతం అతడు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు."