అఫ్గానిస్థాన్‌లో సాయుధ దళాలపై జరిగిన దాడుల్లో నాలుగురోజుల వ్యవధిలోనే 58 మంది పౌరులు మరణించారు. మరో 143 మంది గాయపడ్డారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నాలుగు రాష్ట్రాల్లో(కాబుల్, ఘాజ్నీ, ఖోస్ట్, జాబుల్) ఈ దాడులు సంభవించినట్టు అధికారులు తెలిపారు.
కాబూల్‌లో గత శనివారం జరిగిన దాడిలోనే 30మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారిలో అధిక శాతం విద్యార్థులే ఉన్నారు. మరో 77 మంది క్షతగాత్రులయ్యారు. ఖోస్ట్‌లో మంగళ వారం దుండగులు నిర్వహించిన దాడుల్లో.. ఐదుగురు బలయ్యారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. అదే రోజు జాబుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. ఘాజ్నీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.