తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

స్వచ్ఛ మౌంట్​ ఎవరెస్ట్​ కార్యక్రమం జోరుగా సాగుతోంది. సైన్యం సాయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది నేపాల్ ప్రభుత్వం. ఏప్రిల్​ 14 నుంచి ఇప్పటివరకు 5వేల కిలోల చెత్త సేకరించింది.

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

By

Published : May 9, 2019, 2:30 PM IST

ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. పర్వాతోహరణకు ఎంతో మంది వెళ్తున్నారు. వారంతా ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లిన వస్తువులు, చెత్తను వెనక్కు తెచ్చేయాలి. అలా చేయడం లేదు. ఫలితంగా కొండపై చాలా చెత్త పేరుకు పోయింది.

నేపాల్​ సైన్యం సాయంతో హెలికాఫ్టర్లను ఉపయోగించి మరీ వెళ్లి శుభ్రం చేయిస్తున్నారు అధికారులు. ఏప్రిల్​ 14న నుంచి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించారు. ఇందులో పునర్వినియోగించదగ్గ చెత్తను వేరు చేసి, శుద్ధి చేస్తున్నారు.

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

"నేపాల్​ సైన్యంతో పాటు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించాం. వాటిలో అధిక శాతం సిలిండెర్లు, ప్లాస్టిక్​ సంచులు, ప్లాస్టిక్​ వ్యర్థాలతో పాటు పడేయదగ్గ వస్తువులే ఉన్నాయి."
-దండు రాజ్​ గిమ్రే, నేపాల్ పర్యటక శాఖ డీజీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details