అఫ్గానిస్థాన్‌లోని కందహార్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం జరి జిల్లాలో ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నాయి. తాలిబన్లు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాద సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఫిబ్రవరిలో తాలిబన్లు- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తాలిబన్లు బాంబులు, రాకెట్లతో చెలరేగిపోతున్నారు.