ఫిలిప్పీన్స్లో వీస్తున్న ప్రచండ గాలుల కారణంగా... సముద్రంలో మూడు పడవలు మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 31 మంది మృతిచెందారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతయింది.
గుయిమారస్, ఇలోయిలో రాష్ట్రాల్లో శనివారం ఆకస్మికంగా తీవ్రమైన గాలులు, శక్తిమంతమైన తరంగాలతో రెండు పడవలు బోల్తా పడి చాలా మంది ప్రయాణికులు చనిపోయారని తీర ప్రాంత రక్షక దళం అధికారులు తెలిపారు. అందులోని 62 మంది ప్రయాణికులు, సిబ్బందిని రక్షించినట్లు పేర్కొన్నారు. మూడో పడవ బోల్తా పడినప్పటికీ.. అందులో ప్రయాణికులెవరూ లేనందున పెద్ద ప్రమాదం తప్పింది.