తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి

జమ్ముకశ్మీర్​ పూంచ్,రాజౌరి సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ దాడిలో 16 జంతువులు మరణించాయని అధికారులు తెలిపారు. పాక్​ దుశ్చర్యను భారత్​ సమర్థంగా తిప్పికొట్టినట్టు వివరించారు.

పాక్​ కాల్పులు

By

Published : Sep 21, 2019, 10:08 PM IST

Updated : Oct 1, 2019, 12:37 PM IST

పాక్​ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని పూంచ్​, రాజౌరీ జిల్లాల్లో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి శనివారం కాల్పులకు పాల్పడింది. పాక్​ దుశ్చర్యను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

తొలుత శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నౌషెరాలో, రాత్రి 11:45కు బాలాకోట్​లోని మెంధర్​లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​. ఇవాళ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు మరోసారి కాల్పులకు తెగించిందని భారత సైనిక అధికారి తెలిపారు. ఈ ఘటనల్లో 16 మూగజీవులు ప్రాణాలు కోల్పోయాయని అధికారులు వెల్లడించారు.

సైనిక పోస్టులు, సమీప గ్రామాలే లక్ష్యంగా మోర్టార్లతో దాడులు చేసింది పాక్​ సైన్యం. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాలలు మూసివేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు పాక్​ దాదాపు 2,050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనల్లో 21మంది భారతీయులు మరణించారు. అనేక మంది గాయపడినట్లు అధికారుల వెల్లడించారు.

ఇదీ చూడండి:చింపాంజీలను స్వాధీనం చేసుకున్న ఈడీ- ఎందుకంటే

Last Updated : Oct 1, 2019, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details