తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​, చైనా ప్రజల శాంతి కోసం ఏదైనా చేస్తా'

చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై ముందు నుంచి భారత్​కు మద్దతుగా నిలుస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోమారు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల ప్రజల శాంతి కోసం ఏ సాయం చేయడానికైనా సిద్ధమన్నారు.

Trump
'భారత్​, చైనా ప్రజల శాంతి కోసం శాయశక్తులా కృషి చేస్తా'

By

Published : Jul 17, 2020, 9:19 AM IST

భారత్​, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇరు దేశాల ప్రజల శాంతి కోసం శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనపై ముందు నుంచి భారత్​కు మద్దతుగా నిలుస్తోంది ట్రంప్​ పరిపాలన విభాగం.

సరిహద్దులో నెలకొన్న సమస్య అంశంలో భారత్​కు ట్రంప్​ మద్దతుగా నిలుస్తారా అన్న ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు శ్వేతసౌధం అధికార ప్రతినిధి కైలీ మెక్​ఎనానీ.

"భారత్​, చైనా ప్రజలను అమితంగా ప్రేమిస్తానని ఆయన (ట్రంప్​) తెలిపారు. ఇరు దేశాల ప్రజల శాంతి కోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు."

- కైలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధం అధికార ప్రతినిధి

అంతకుముందు.. అమెరికాకు భారత్​ కీలక భాగస్వామి అని పేర్కొన్నారు శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ట్రంప్ గొప్ప స్నేహితుడని తెలిపారు.

అలాగే.. అమెరికాకు భారత్​ గొప్ప భాగస్వామిగా అభివర్ణించారు అగ్రరాజ్య విదేశాంగ శాఖ మంత్రి మైక్​ పాంపియో. భారత విదేశాంగ మంత్రితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన సహా కీలక అంశాలపై తాము పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆశలు పెంచిన ఆక్స్‌ఫర్డ్‌- వైరస్​ నుంచి డబుల్​ రక్షణ!

ABOUT THE AUTHOR

...view details