తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎదుటివాళ్లు మాస్క్​ పెట్టుకోలేదా? ఇలా చెప్పండి..

కొవిడ్​-19పై పోరులో మాస్క్​ తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు. అయితే.. పరిచయం లేని వ్యక్తిని మాస్క్​ ధరించండి అని అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి వాళ్లను మాస్క్​ ధరించమని ఎలా అడగాలో చెబుతున్నారు అమెరికాలోని ఆబర్న్ విశ్వవిద్యాలయం నిపుణులు.

mask
మీ పక్కనున్న వ్యక్తి మాస్క్​ ధరించటం లేదా? అయితే ఇలా చెప్పండి

By

Published : Oct 7, 2020, 7:49 AM IST

ఎదుటివారిని మాస్క్​ ధరించండి అని ఎలా చెప్తే బాగుంటుందో వివరిస్తున్నారు ఆబర్న్ విశ్వవిద్యాలయం నిపుణులు. మనకు పరిచయం లేని వ్యక్తులను మాస్కు ధరించండి అని చాలా తెలివిగా, మర్యాదపూర్వకంగా అడగాలి లేకుంటే వారు మారే అవకాశం తక్కువని అమెరికాలోని ఆబర్న్​ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జాన్​ కవోకిజియాన్​ అంటున్నారు.

ఒకవేళ మీరు ఏ దుకాణంలోనో, రెస్టారెంట్​లోనో ఉంటే అక్కడ ఉన్న ఇంఛార్జికి మాస్కు ధరించని వ్యక్తి గురించి చెప్పాలి. మీరు ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు అవతలివారితో 'మనిద్దరి భద్రత కోసం మనం మాస్కులు ధరించి మాట్లాడుకుందాం.' అని తెలివిగా చెప్పాలని నిపుణులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details