తెలంగాణ

telangana

ETV Bharat / international

'మే 1 నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ' - అఫ్గానిస్తాన్​పై అమెరికా అధ్యక్షుని కామెంట్లు

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా తుదిదశ బలగాల ఉపసంహరణను మే 1న ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉగ్రదాడి జరిగిన సెప్టెంబర్​ 11 కంటే ముందే ఈ పక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Biden
బైడెన్

By

Published : Apr 15, 2021, 6:03 AM IST

Updated : Apr 15, 2021, 7:28 AM IST

అఫ్గానిస్థాన్​లోని అమెరికా బలగాల ఉపసంహరణకు ఉద్దేశించిన గడువు మే 1న ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున ఈ ప్రక్రియను ప్రారంభించి.. 20 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన సెప్టెంబర్​ 11 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

"అమెరికా సైన్యం, అలాగే మా నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటాయి. అయితే ఉగ్రవాద ముప్పును మాత్రం తేలిగ్గా తీసుకోం. మా బలగాలు, భాగస్వాములపై తాలిబన్ దాడి జరిగితే ప్రతిస్పందనగా అమెరికా తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించడానికి వెనుకడుగు వెయ్యదు''.

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి అఫ్గానిస్థాన్​కు మద్దతు పెంచే విషయాన్ని చర్చిస్తానని బైడెన్​ తెలిపారు. ముఖ్యంగా భారత్​ సహా పాక్, రష్యా, చైనా, టర్కీల మద్దతు కోరనున్నట్లు​ వెల్లడించారు.

చర్చల్లో పాల్గొనం​..

మరోవైపు.. అఫ్గానిస్థాన్​లో శాంతి పునరుద్ధరణ ప్రతిపాదనలతో పాటు.. అమెరికన్ దళాల ఉపసంహరణకు ఆరు నెలల జాప్యాన్ని తాలిబన్ తిరస్కరించింది. విదేశీ సైనికులు తమ భూభాగాన్ని వీడేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని సంస్థ ప్రతినిధి మహ్మద్ నయీమ్ వార్డక్ వెల్లడించారు.

ఇవీ చదవండి:11 తీవ్రవాద సంస్థలపై ఆ దేశం నిషేధం

అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్

Last Updated : Apr 15, 2021, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details