అమెరికాలోని ఒక్లహామాలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వందేళ్ల చరిత్ర గల ఓ చెట్టు ప్రతిరూపాన్ని పునఃప్రతిష్టించారు. 24 ఏళ్ల క్రితం జరిగిన బాంబు దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఏటా నిర్వహించే స్మారకదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
1995 ఏప్రిల్ 19న ఒక్లహామా నగరంపై ఉగ్రవాదులు బాంబు దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించారు. ఈ విషాద ఘటనలో 168 మంది అసువులు బాసారు. 100ఏళ్ల చరిత్ర కలిగిన ఓ మహా వృక్షం ఈ విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. అది మరణించినా, దాని ప్రతిరూపం ఉండాలని భావించారు.