అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden News), చైనా అధ్యక్షుడు జిన్పింగ్(xi jinping news) త్వరలో వర్చువల్గా సమావేశం కానున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షభవనం శ్వేతసౌథం తెలిపింది. ఈ ఏడాది చివరిలోనే సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్తో చైనా విదేశాంగ మంత్రి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్తో చైనా విదేశాంగ మంత్రి మధ్య సమావేశం దాదాపు 6గంటలపాటు జరిగింది. తన చర్యలతో చైనా ఆందోళన కలిస్తున్న పలు అంశాలను సులివన్ ఈ సమావేశంలో లేవనెత్తారు. మానవహక్కులు, జిన్జియాంగ్, హాంగ్కాంగ్, దక్షిణచైనా సముద్రం, తైవాన్.. తదితర అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చలు జరిపారు.
బిజీ షెడ్యూల్ కారణంగా వచ్చే ఏడాది నుంచి ఇరు దేశాధ్యక్షులు కలిసి సమావేశంలో పాల్గొనకపోవచ్చని.. అందుకే ఈ ఏడాది చివరి వరకు వర్చువల్ మీటింగ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ బదిలీ.. అదే కారణమా?