మెక్సికో నుంచి వస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన అస్త్రం.. 'సరిహద్దు గోడ'. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా... టెక్సాస్‌లో సరిహద్దు గోడ నిర్మాణం కోసం 275 మిలియన్ డాలర్ల నిధులను కాడెల్ అనే సంస్థకు అందజేసింది అమెరికా ప్రభుత్వం. నిర్మాణ పనులు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకానున్నాయి.
అలబామాకు చెందిన కాడెల్ సంస్థ.. 14మైళ్ల(22.5కిలోమీటర్ల) సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. టెక్సాస్‌లోని లారెడో ప్రాంతంలో ఈ నిర్మాణం జరగనుంది. ఇక్కడ ఉండే రియో గ్రాండే నది టెక్సాస్, మెక్సికో మధ్య ప్రవహిస్తుంది.