తెలంగాణ

telangana

బాటిల్ నీళ్లతో.. భారీ బాంబుని నిర్వీర్యం చేసి..

By

Published : Mar 11, 2022, 4:45 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల భారీ బాంబును జార విడిచింది. అది గనుక పేలితే దాని విస్పోటన శక్తికి ఒక పెద్ద భవంతిని క్షణాల్లో నేల మట్టం చేయగలదు. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ భారీ బాంబుని ఉక్రెయిన్‌ బాంబ్‌ స్వ్కాడ్‌కు చెందిన ఇద్దరు నిపుణులు ఎంతో ధైర్యంగా దాన్ని నిర్వీర్యం చేశారు.

Ukraine Crisis
ఉక్రెయిన్ యుద్ధం

Ukraine Crisis: గత రెండు వారాలుగా ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. తుపాకులు మోత, బాంబు పేలుళ్లతో ఆ దేశం అట్టుడుకుతోంది. నాటో దేశాలు అందిస్తున్న సహాయసహకారాలతో ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా రష్యన్‌ సేనలకు సమాధానమిస్తోంది. పౌరులు స్వతంత్రంగా తుపాకులు చేతబూని దేశం కోసం పోరాడుతున్నారు. కొంతమంది ఉక్రేనియన్లు నిర్భయంగా రష్యా యుద్ద ట్యాంకులకు ఎదురు నిలబడి ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్నారు. రష్యా ప్రయోగించే భారీ క్షిపణులు, బాంబులకు సైతం ఉక్రెయిన్‌ సైన్యం భయపడటం లేదు.

యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల భారీ బాంబును జార విడిచింది. అది గనుక పేలితే దాని విస్పోటన శక్తికి ఒక పెద్ద భవంతిని క్షణాల్లో నేల మట్టం చేయగలదు. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ భారీ బాంబుని ఉక్రెయిన్‌ బాంబ్‌ స్వ్కాడ్‌కు చెందిన ఇద్దరు నిపుణులు ఎంతో ధైర్యంగా దాన్ని నిర్వీర్యం చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఒక బాటిల్‌ నీటిని ఉపయోగించి నిర్వీర్యం చేశారు. ఒకరు బాటిల్‌తో నీరు పోస్తుండగా మరొకరు చాకచాక్యంగా దాన్ని పేలకుండా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వీళ్ల ధైర్యానికి సలాం కొట్టాల్సిందే అంటూ కామెంట్లు పెడుతూ కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి:పౌరులపైనా రష్యా కాల్పులు... యుద్ధనేరాలపై విచారణకు అమెరికా డిమాండ్

ABOUT THE AUTHOR

...view details