ఇరాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం కోరుకుంటే ఆ దేశం కథ ముగిసినట్టేనని ట్వీట్ చేశారు. ఎప్పుడూ అమెరికా జోలికి రావొద్దని హెచ్చరించారు.
ట్రంప్ ఆగ్రహంతో అమెరికా- ఇరాన్ దేశాల మధ్య బంధం మరింత బలహీనపడినట్టు స్పష్టమవుతోంది.
'ఇరాన్‌తో యుద్ధం జరగదు', 'త్వరలో ఇరాన్ చర్చలకు సిద్ధపడుతుంది...' అంటూ ప్రకటనలు చేసిన ట్రంప్... ఇరాన్‌ను ధ్వంసం చేస్తామని చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి.