తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్షుడిగా ట్రంప్​ చివరి పర్యటన అక్కడికే! - బైడెన్​ ప్రమాణ స్వీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మరో సారి ప్రజల ముందుకు రానున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉండే అలామో పట్టణంలో ట్రంప్​ పర్యటన సాగే అవకాశం ఉన్నట్లు వైట్​హౌస్​ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో వలసలకు వ్యతిరేకంగా మెక్సికో సరిహద్దుల్లో నిర్మించిన గోడ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Trump to visit US-Mexico border to laud border wall
గోడ మంత్రంతో రానున్న ట్రంప్​

By

Published : Jan 10, 2021, 12:44 PM IST

క్యాపిటల్​ అల్లర్ల తరువాత ప్రజలకు కనిపించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. తన చివరి పర్యటనను ఖరారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉండే అలామో పట్టణంలో గోడ దగ్గరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైట్​హౌస్​ వర్గాలు తెలిపాయి. వలసదారులకు వ్యతిరేకంగా నిర్మించిన గోడను సందర్శించేందుకు ఈ మంగళవారం వెళ్లవచ్చని పేర్కొన్నాయి.

వలసలకు వ్యతిరేకంగా గోడను నిర్మిస్తామని 2016లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ వాగ్దానం చేశారు. అమెరికా, మెక్సికో సంయుక్తంగా దీనిని నిర్మిస్తాయని చెప్పారు. సుమారు 9 మీటర్ల ఎత్తు, 400 మైళ్ల దూరంలో ఈ గోడను కట్టించారు. ఈ గోడ నిర్మాణానికి అడ్డుగా ఉన్న కొండలను నేలమట్టం చేశారు. అనేక ఆవాసాలను భూస్థాపితం చేశారు.

మరికొద్ది రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి తప్పుకోనున్న ట్రంప్​.. క్యాపిటల్​ హింసాత్మక ఘటన తరువాత తొలిసారిగా మాట్లాడనున్నారు. అయితే ఈ లోపే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు డెమొక్రాట్లు ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ తరుణంలో ట్రంప్​ తన విజయాలను హైలైట్ చేయడానికి ఊవిళ్లూరుతున్నారు.

జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి మైక్‌పెన్స్‌

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్‌ కార్యక్రమానికి ప్రస్తుత ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హాజరవుతారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. మైక్‌ పెన్స్‌ రావటాన్ని సంతోషిస్తున్నామని, సాదరంగా ఆహ్వానిస్తామని బైడెన్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కానని ట్రంప్‌ చెప్పిన తరువాత మైక్స్‌పెన్స్‌ హాజరు అవుతున్నట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. బైడెన్ గెలుపును కాంగ్రెస్‌ ధ్రువీకరించే సమయంలో ట్రంప్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ పెన్స్‌ నిబంధనలకు కట్టుబడి నడుచుకున్నారు. ఫలితాలు తారుమారు చేయాలని ట్రంప్‌ పరోక్షంగా ఆదేశించినప్పటికీ పెన్స్‌ నిరాకరించారు. తొలి నుంచి ట్రంప్‌నకు విధేయుడిగా ఉన్న పెన్స్ చివర్లో రాజ్యాంగబద్ధంగా నడుచుకొని అందరి మన్ననలు పొందారు.

ఇవీ చూడండి:

క్లైమాక్స్​కు 'అధ్యక్ష పోరు'- ట్రంప్​ ట్విస్ట్ ఇస్తారా?

గెలుపైనా.. ఓటమైనా... నిను వీడని నీడ మేమే!

'క్యాపిటల్'​పై దాడి చేసిన వారి ఉద్యోగాలపై వేటు!

ABOUT THE AUTHOR

...view details