తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం వద్దు​: పుతిన్​పై ట్రంప్​ జోక్​

జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, రష్యా అధ్యక్షుడు పుతిన్​ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో '2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని' పుతిన్​తో సరదాగా జోక్ చేశారు ట్రంప్​.

By

Published : Jun 28, 2019, 11:46 PM IST

అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు ప్లీజ్​: పుతిన్​పై ట్రంప్​ జోక్​

జపాన్​లో జరుగుతున్న జీ-20 సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్... రష్యా అధ్యక్షుడు పుతిన్​తో సరదాగా జోక్​ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని ఛలోక్తులు విసిరారు.

గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​నకు అనుకూలంగా రష్యా జోక్యం చేసుకుందని అగ్రదేశంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతేడాది ఫిన్​లాండ్​లోని హెల్సింకీలో పుతిన్​-ట్రంప్​ భేటీపైనా దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంలోనే ట్రంప్ ఇలా జోక్​ వేసి అందరినీ నవ్వించారు.

పుతిన్​తో తనకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఆయనను జీ-20 సదస్సు సందర్భంగా కలుసుకున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.

రష్యాలో పర్యటించండి...

రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్ష దేశాలు విజయం సాధించాయి. ఆ గెలుపు సంబరాలను వచ్చే ఏడాది రష్యాలోని క్రెమ్లిన్​లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని ట్రంప్​ను పుతిన్​ ఆహ్వానించారు.

ఆధారాల్లోవ్​..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ చేపట్టిన రాబర్ట్​ మ్యూలర్ కమిటీ.. అందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు

ABOUT THE AUTHOR

...view details