తెలంగాణ

telangana

ETV Bharat / international

వలసలు ఆపలేదని నిధులు నిలిపివేత

అక్రమ వలసల నియంత్రణలో మెక్సికో మరిన్ని చర్యలు చేపట్టకపోతే వచ్చే వారం ఆ దేశంతో సరిహద్దులను మూసేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చిరించారు. తాజాగా మూడు మధ్య అమెరికా దేశాలకు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్

By

Published : Mar 31, 2019, 6:51 AM IST

Updated : Mar 31, 2019, 7:07 AM IST

వలసలు ఆపలేదని నిధులు నిలిపివేత
అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కొరడా ఝుళిపిస్తున్నారు. వలసలపై మెక్సికో సరైన చర్యలు చేపట్టకపోతే వచ్చే వారం దక్షిణ సరిహద్దును మూసేస్తామని ట్రంప్​ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా మరో అడుగు ముందుకేశారు.

మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్, హొండురస్, గ్వాటెమాలా దేశాలకు ఆర్థిక సాయాన్ని నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు దేశాలకు 2017, 18 సంవత్సరాలకు గాను రావాల్సిన సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

కారణం..

మెక్సికో నుంచి అమెరికా సరిహద్దుకు చేరుకొంటున్న అక్రమ వలసదారులకు ఈ మూడు దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నట్లు అమెరికా గుర్తించింది. అందుకే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఖండించిన డెమొక్రాట్లు..

ఆర్థిక సాయాన్ని నిలిపివేయడాన్ని డెమొక్రాట్లు తీవ్రంగా ఖండించారు. ఇది మధ్య అమెరికా దేశాల్లోని కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Last Updated : Mar 31, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details