నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా తన నామినేషన్ను అంగీకరించారు. మరో నాలుగు సంవత్సరాలు పదవిలో కొనసాగటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శ్వేతసౌధంలో జరిగిన రిపబ్లిక్ కన్వెన్షన్లో ప్రసంగించారు ట్రంప్.
"గత నాలుగేళ్లలో సాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నాను. ప్రజల అపూర్వ మద్దతుతో ఇక్కడ నిల్చొని ఉన్నాను. రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తును మరో స్థాయికి తీసుకెళ్తాను."
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.