కరోనా చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ వినియోగించేందుకు అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్డీఏ) ఆమోదించింది. కరోనా చికిత్సకు తొలిసారిగా ఓ ఔషధాన్ని ఆమోదించింది ఎఫ్డీఏ.
ఈ మందును ఆసుపత్రిలో చేరిన బాధితులకు ఐవీ ద్వారా అందివ్వాలని స్పష్టం చేసింది. కనీసం 12 ఏళ్లు లేదా 40 కిలోల బరువు ఉన్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు ఈ ఔషధాన్ని వినియోగించేందుకు అనుమతిచ్చింది ఎఫ్డీఏ.