అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల ఆక్రమణల జోరు కొనసాగుతోంది. దాదాపు 85 శాతం భూభాగాన్ని హస్తగతం చేసుకున్నట్లు ఇటీవలే తాలిబాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేసింది అమెరికా రక్షణ రంగ విభాగం పెంటగాన్. అఫ్గాన్ ప్రభుత్వం వల్లే ఇలా జరుగుతోందని, ఇందులో సైన్యం తప్పేమీలేదని ఆరోపించింది.
"తాలిబాన్ల దురాక్రమణలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అఫ్గాన్‌లో భద్రత క్రమంగా లోపిస్తోంది. దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్ పాలకులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాం. వారు తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలరని నమ్ముతున్నాం. అఫ్గాన్ ప్రభుత్వం తమ ప్రజల కోసం పోరాడే సమయం ఆసన్నమైంది."
--జాన్ కిర్బీ, పెంటగాన్ సమాచార ప్రతినిధి.