ఆరాంకో చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులు నిస్సందేహంగా ఇరాన్ చేయించినవే అని సౌదీ ఆరేబియా ఆరోపించింది. ఇరాన్‌లోని ఉత్తర భాగం నుంచి ఈ దాడులు జరిగాయని, అయితే కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి చేశారో ఇంకా తెలియలేదని పేర్కొంది. దాడులకు ఉపయోగించిన 18 డ్రోన్లు, ఏడు క్రూయిజ్ క్షిపణుల శకలాలను ఈ సందర్భంగా ప్రదర్శించింది.
అపరాధి ఎవరు?
ఈ దాడుల వెనుక ఉన్న అపరాధి ఇరానా? కాదా? అనే విషయంలో సౌదీ స్పష్టతనీయలేదు. అయితే దాడులు ఎవరు చేశారనే విషయంపై ఐరాస దౌత్యవేత్తలు విచారణ చేయనున్నారు.
50 శాతం వరకు నష్టం
ఈ దాడుల ఫలితంగా తమ చమురు ఉత్పత్తిలో 50 శాతం వరకు నష్టపోయామని స్పష్టం చేసింది సౌదీ. ఇది రికార్డు స్థాయిలో చమురు ధరల పెరుగుదలకు కారణమైందని పేర్కొంది. ఇది చమురు రంగ దుర్భలత్వాన్ని ఎత్తిచూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.