అమెరికా పర్యటనలో(PM modi us visit) భాగంగా.. జపాన్ ప్రధాని యొషిహిడె సుగాతో(japan pm news) ప్రధాని మోదీ సమావేశమయ్యారు.. ఇండో పసిఫిక్ ప్రాంతం(Indo pacific region), ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొంది.
యొషిహిదే సుగాతో ప్రధాని మోదీ యొషిహిదే సుగాకు నమస్కరిస్తున్న మోదీ "ఉమ్మడి విలువల ఆధారంగా జపాన్‌తో ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోయింది. జపాన్ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు."
-విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఇటీవల టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు యొషిహిదే సుగాకు మోదీ ధన్యవాదాలు తెలిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. అఫ్గాన్ సహా ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారని చెప్పారు.
మోదీ, సుగా ఏప్రిల్ నెలలో ఫోన్లో మాట్లాడుకున్నారు. స్థిరమైనన, వైవిధ్యభరితమైన, విశ్వసనీయ సరఫరా గొలుసును నిర్మించడంలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనాపై పోరులో సమష్టిగా పని చేయాలని తీర్మానించుకున్నారు.
అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో భేటీయైన మోదీ..ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఆర్థిక సంబంధాల బలోపేతం, ప్రజాసంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మైత్రి బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:'అమెరికాకు భారత్ అత్యంత ప్రధానమైన భాగస్వామి'