వాతావరణ సంక్షోభంపై నేడు జరిగే ప్రపంచ దేశాధినేతల వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అమెరికా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ సమావేశం ఇవాళ సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ఏడున్నర గంటలపాటు సాగనుంది. మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
వాతావరణ సంక్షోభంపై నేడు మోదీ కీలక ప్రసంగం
అమెరికా ఆధ్వర్యంలో వాతావరణ సంక్షోభానికి సంబంధించి కీలక సమావేశం నేడు జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా హాజరుకానున్నారు.
వాతావరణ సంక్షోభంపై నేడు మోదీ కీలక ప్రసంగం
సుమారు నలభై దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు వర్చువల్ సమావేశంలో పాల్గొంటారని తెలిపింది. యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులపై దేశాధినేతలు చర్చించనున్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ సిద్ధం చేసే అవకాశమున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన బైడెన్ తిరిగి పారిస్ ఒప్పందంలోకి అడుగుపెడుతున్నట్లు జనవరి 20న ప్రకటించారు.
ఇదీ చూడండి:'ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టండి'
Last Updated : Apr 22, 2021, 7:10 AM IST