తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్, బంగ్లాదేశ్ ప్రధానులతో మోదీ భేటీ - బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనాతో మోదీ భేటీ

ద్వైపాక్షిక సంబంధాల పురోభివృద్ధే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్​, భూటాన్ ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఐరాస సర్వసభ్య సమావేశం కోసం అమెరికాలో పర్యటించిన మోదీ... పలుదేశాల నేతలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

భూటాన్, బంగ్లాదేశ్ ప్రధానులతో మోదీ భేటీ

By

Published : Sep 28, 2019, 1:02 PM IST

Updated : Oct 2, 2019, 8:21 AM IST

భూటాన్, బంగ్లాదేశ్ ప్రధానులతో మోదీ భేటీ

భారత్​-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల సమీక్షే ప్రధాన ధ్యేయంగా ఇరుదేశాల ప్రధానులు నరేంద్రమోదీ, లోటే థెరింగ్​ అమెరికాలో సమావేశమయ్యారు. జలవిద్యుత్​, అంతరిక్షం, డిజిటల్​ కనెక్టివిటీ, ఆర్థిక, తృతీయ విద్యారంగాల్లో ఇరుదేశాలు ఉమ్మడిగా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.

74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పలుదేశాల నేతలతో సమావేశమయ్యారు. ఈ వారం జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ 'విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు' (సీజీఆర్​ఐ) ప్రతిపాదించారు. అందులో వ్యవస్థాపక సభ్య దేశంగా చేరాలని భూటాన్​ను కోరారు.

ఉగ్రవాదాన్ని సహించం..

ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనాతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని సహించేంది లేదని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. బలమైన భద్రతా భాగస్వామ్యం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

ఇరుదేశాల మధ్య ఉన్న భూ, నదీ, సముద్ర, వాయు అనుసంధానం గురించి, విద్యుత్​ భాగస్వామ్యం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాల పురోభివృద్ధిపై చర్చించారు. ఇవి పొరుగు దేశాల పురోగతి, స్థిరత్వానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.

మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న హసీనాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ బంగ్లాదేశ్​ రండి..

బంగబంధు, తన తండ్రి అయిన షేక్​ ముజుబూర్ రెహ్మాన్​ 100వ జన్మదిన వేడుకలకు హాజరవ్వాల్సిందిగా ప్రధాని మోదీని షేక్​ హసీనా ఆహ్వానించారు. మోదీ ఈ ఆహ్వానాన్ని అంగీకరించారు.

ఇదీ చూడండి: 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్​ఖాన్​'

Last Updated : Oct 2, 2019, 8:21 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details