తెలంగాణ

telangana

ETV Bharat / international

'బహుళ పక్ష విధానంలో సంస్కరణలు అవసరం'

అంతర్జాతీయ బహుళపక్ష విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఐరాస ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు మోదీ. ఐరాసలో సంస్కరణల కోసం సభ్య దేశాలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

By

Published : Sep 22, 2020, 5:24 AM IST

modi
నరేంద్రమోదీ

ఐక్య రాజ్య సమితి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 21వ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ఐరాసతో పాటు బహుళపక్ష విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇందుకు సభ్య దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మోదీ.

ముందే రికార్డు చేసిన వీడియో ద్వారా ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు చేపడితే అన్ని దేశాలకు భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఐరాస వేదికగా శాంతి, అభివృద్ధి కోసం కోసం కృషి చేసిన దేశాలను ప్రశంసించారు మోదీ.

ఈ సమావేశాలు సెప్టెంబర్​ 22 నుంచి 29 వరకూ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో 193 సభ్య దేశాలు 'ది ఫ్యూచర్‌ వుయ్‌ వాంట్‌, ది యునైటెడ్‌ నేషన్స్‌ వుయ్‌ నీడ్‌' అనే అంశంపై చర్చలు జరిపి ఓ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. 26న ప్రధాని మోదీ మరోసారి ఈ కార్యక్రమంలో వీడియో రూపంలో జాతీయ సందేశాన్ని వినిపించనున్నారు.

ఇదీ చూడండి:ఐరాస సర్వ ప్రతినిధి సభ

ABOUT THE AUTHOR

...view details