తెలంగాణ

telangana

ETV Bharat / international

Pak Terror News: ఉగ్ర సంస్థలకు స్వర్గధామంగా పాకిస్థాన్​..! - పాక్​ ఉగ్రవాద సంస్థలు

పాకిస్థాన్​ కేంద్రంగా ఉగ్రవాదం (Pak terror news) పెరిగిపోతోందని.. అమెరికా కాంగ్రెషనల్​ రిపోర్టు తెలిపింది. దాదాపు 12 విదేశీ ఉగ్రవాద సంస్థలు.. పాక్​ నుంచే ఉగ్రకార్యకలాపాలు (Terrorist attack) కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ఆ దేశంలో ఉగ్రవాద నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని చురకలు అంటించింది.

Pakistan home to 12 foreign terrorist organisations: CRS report
ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంగా పాకిస్థాన్​..!

By

Published : Sep 28, 2021, 10:57 AM IST

Updated : Sep 28, 2021, 1:24 PM IST

దాదాపు 12 విదేశీ ఉగ్రవాద సంస్థలకు(ఎఫ్​టీఓ).. పాకిస్థాన్(Pak terror news)​ కేంద్రంగా మారిందని అమెరికా కాంగ్రెషనల్​ నివేదికలో వెల్లడించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హుజీ​ వంటివి ఉన్నాయని పేర్కొంది. 1980ల నుంచి పాక్​ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు(Terrorist attack) పెరిగాయని తెలిపింది.

అమెరికా కాంగ్రెస్​ పరిశోధనా విభాగం.. ఇండిపెండెంట్​ కాంగ్రెషనల్​ రీసెర్చ్​ సర్వీస్​(సీఆర్​ఎస్​).. గత వారం జరిగిన క్వాడ్​ సదస్సు సందర్భంగా ఈ రిపోర్టును విడుదల చేసింది. ఈ గ్రూపులను ఐదు విధాలుగా విభజించింది.

అవి

ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసే సంస్థలు.

అఫ్గాన్‌లో దాడులు చేసేవి.

భారత్‌, కశ్మీర్‌ లక్ష్యంగా దాడులు చేసేవి.

పాక్‌లోనే విధ్వంసం సృష్టించేవి.

షియా వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవి.

లష్కర్​ తోయిబా నుంచి అల్​ఖైదా వరకు ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పాక్​ పుట్టినిల్లుగా మారిందని తమ నివేదికలో వెల్లడించింది.

లష్కరే తోయిబా(ఎల్​ఈటీ) 1980ల్లో పాకిస్థాన్​లో ఏర్పడింది. 2001లో విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర పడింది. భారత్​లో (Pak terror attacks in India) జరిగిన 2008 ముంబయి ఉగ్రదాడులతో సహా ఎన్నో భయంకర ఉగ్ర కుట్రల వెనుక ఎల్​ఈటీ ఉందని సీఆర్​ఎస్​ చెప్పింది.

కశ్మీర్​కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది మసూజ్​ అజార్​.. 2000లో జైషే మహ్మద్​ సంస్థను స్థాపించాడు. 2001లో దీనిపై ఎఫ్​టీఓ ముద్రపడింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి సహా ఎన్నో భయానక దాడులకు ఇది కారణమైందని కాంగ్రెస్​ నివేదిక తెలిపింది.

హరకత్​-ఉల్​ జిహాద్​ ఇస్లామీ(హుజీ) అఫ్గాన్, పాక్​, బంగ్లాదేశ్​, భారత్​లో తన ఉనికిని పెంచుకుంటోందని వివరించింది.

''హుజీ ఇప్పుడు అఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, భారత్​లో తన ఉనికిని చాటుకుంటోంది. కశ్మీర్​ను పాక్​లో విలీనం చేయాలని కోరుతోంది. ముఖ్యంగా ఇది పాక్​ ఆక్రమిత కశ్మీర్ (Kashmir news​), కొన్ని పాక్​ నగరాల కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.''

- సీఆర్​ఎస్​ రిపోర్ట్​

వీటితో పాటు హిజ్బుల్​ ముజాహిద్దీన్​, అల్​ ఖైదా కూడా పాకిస్థాన్(Pak terror news)​ ​కేంద్రంగా పనిచేస్తున్నాయని యూఎస్​ కాంగ్రెస్​ వెల్లడించింది. ఎన్నో ఉగ్రముఠాలకు(Terrorist attack) పాకిస్థాన్​ స్వర్గధామంగా మారుతోందని స్పష్టం చేసింది.

''ఉగ్రవాద సంస్థలకు పాక్​ సురక్షిత ప్రాంతంగా మారింది. అదో స్వర్గధామంలా తయారైంది. అఫ్గానిస్థాన్​ను లక్ష్యంగా చేసుకున్న సంస్థలకు, భారత్​పై (Pak attack India) గురిపెట్టిన ఉగ్రముఠాలకు.. తమ భూభాగం నుంచి కార్యకలాపాలు కొనసాగించేందుకు పాక్​ అవకాశమిస్తోంది.''

- యూఎస్​ కాంగ్రెస్​ నివేదిక

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో 2019లో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పాక్​(Pak terror news)​ కాస్త పెంచి పోషించిందని సీఆర్​ఎస్​ ప్రస్తావించింది. అయితే.. అఫ్గాన్​, భారత్​ లక్ష్యంగా పనిచేసే ఉగ్రముఠాలకు వ్యతిరేకంగా పెద్ద నిర్ణయాలేమీ తీసుకోలేదని పేర్కొంది.

సీఆర్​ఎస్​ నివేదిక.. అమెరికా కాంగ్రెస్​ అధికారిక రిపోర్టు కాదు. స్వతంత్ర నిపుణులు.. ఈ నివేదికను రూపొందిస్తారు.

అఫ్గానిస్థాన్​(Afghanistan Taliban) సహా పాక్​ పోరుగు దేశాలతో పాటు అమెరికా.. చాలా ఏళ్లుగా ఇస్లామాబాద్​ ఉగ్రవాదానికి సురక్షిత ప్రాంతమని, ఆ దేశం వారికి సాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంలోనూ ప్రస్తావించారు.

అయితే.. ఆ ఆరోపణలను పాక్​ ఖండిస్తూ వస్తోంది.

ఇవీ చూడండి: తాలిబన్లతో నిరంతరం టచ్​లో పాక్​ సైన్యం!

ఉగ్రవాదానికి పాక్​ సాయంపై క్వాడ్​ నేతల ఆగ్రహం!

UNGA 2021: మళ్లీ పాక్ వక్ర బుద్ధి- గట్టిగా బదులిచ్చిన భారత్

Last Updated : Sep 28, 2021, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details