తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్ష కేంద్రానికి పయనమైన పునర్వినియోగ నౌక!

అమెరికా అంతరిక్ష కేంద్రం (నాసా)కు చెందిన పునర్వినియోగ అంతరిక్ష నౌక స్పేస్‌ ఎక్స్‌ కార్గో డ్రాగన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. అది ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలను నాసా ట్విటర్‌లో పోస్టు చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.29 గంటలకు ఈ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించినట్లు పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

nasa space x cargo ship launch
అంతరిక్ష కేంద్రానికి పయనమైన పునర్వినియోగ నౌక!

By

Published : Jun 6, 2021, 5:43 AM IST

పునర్వినియోగ అంతరిక్ష నౌక స్పేస్‌ ఎక్స్‌ కార్గో డ్రాగన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. అది ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం (నాసా) ట్విటర్‌లో పోస్టు చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.29 గంటలకు ఈ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించినట్లు పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. శనివారం ఉదయానికి ఈ నౌక అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుందని తెలిపింది. ఇందులో 3,300 కిలోల బరువున్న నిమ్మకాయలు, ఉల్లిపాయలు, అవకాడో, టమాటా, చెర్రీ లాంటి ఆహార పదార్థాలు సహా.. పలు పరికరాలను అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం పంపినట్లు వివరించింది.

ఫ్లోరిడాలోని కెన్నడీ వద్ద ఉన్న 39ఏ లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌పై ఈ నౌకను ప్రయోగించినట్టు నాసా తెలిపింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు నౌక స్వయంచాలకంగా అంతరిక్ష కేంద్రం వద్దకు చేరుకుంటుందని పేర్కొంది. అది అక్కడే నెల రోజులపాటు ఉంటుందని వివరించింది. అక్కడికి నౌక చేరుకోవడాన్ని తెల్లవారుజామున 3.30 గంటల నుంచి నాసా టీవీ, వెబ్‌సైట్‌, మ్యాప్‌లో వీక్షించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:'మోదీ, జిన్​పింగ్​లకు ఆ సామర్థ్యం ఉంది'

ABOUT THE AUTHOR

...view details