ఈ నెల 21న భూమి మీదుగా ఓ భారీశకలం ప్రయాణించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. 2001 ఎఫ్ఓ32గా పిలిచే ఆ గ్రహశకలం వ్యాసం 3 వేల మీటర్లుగా ఉంటుందని చెప్పిన నాసా.. 20 ఏళ్ల క్రితం దానిని గుర్తించినట్లు వెల్లడించింది. భూమికి 2 మిలియన్ కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ గ్రహశకలం ప్రయాణిస్తుందని చెప్పింది.
గ్రహశకలం ప్రయాణించేటప్పుడు అంతరిక్ష పరిశోధకులు దానిని నిశితంగా పరిశీలించేందుకు వీలు చిక్కుతుందని నాసా తెలిపింది. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ శకలం మార్గం కచ్చితత్వంతో ఉందని చెప్పింది. భూమికి ఈ గ్రహశకలానికి ఉండే దూరం చంద్రునికి భూమికి మధ్య ఉన్న దూరానికి ఐదింతలను నాసా వివరించింది. భూమి మీదుగా ఆ గ్రహ శకలం పయనించే సమయంలో గంటకు 77 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా వెల్లడించింది.