తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యావరణ పరిరక్షణపై ఐరాసలో నేడు మోదీ ప్రసంగం

ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి వాతావరణ కార్యాచరణ సదస్సులో ప్రధాని మోదీ నేడు ప్రసంగించనున్నారు. ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పులపై భారత్​ లక్ష్యాలను వివరించనున్నారు ప్రధాని.

పర్యావరణ పరిరక్షణపై ఐరాసలో నేడు మోదీ ప్రసంగం

By

Published : Sep 23, 2019, 10:48 AM IST

Updated : Oct 1, 2019, 4:20 PM IST

న్యూయార్క్​లో నేడు జరగనున్న ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత ప్రభుత్వ లక్ష్యాలు, విపత్తును ఎదుర్కోగల మౌలిక సదుపాయాల కోసం ప్రపంచ దేశాలు ఏకం కావాల్సిన అవసరం వంటి అంశాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు మోదీ.

తొలి వ్యాఖ్యాతల బృందంలో..

ఐరాస సదస్సు ప్రారంభ వేడుకలో భాగంగా తొలి వ్యాఖ్యాతల బృందంలోనే ప్రధాని ప్రసంగం ఉండనుంది. ఈ బృందంలో ప్రత్యేకంగా వాతావరణ మార్పులపై ఏదైనా సానుకూల పురోగతి సాధించిన దేశాధినేతలు, మంత్రులను మాట్లాడేందుకు ఆహ్వానించారు.

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​, న్యూజిలాండ్​ ప్రధాని జసిండా అర్డెర్న్​, మార్షల్​ ఐలాండ్స్​ అధ్యక్షుడు హిల్దా హైన్ తర్వాత మోదీ ప్రసంగిస్తారు. ​తొలి బృందంలోనే ప్రధాని ప్రసంగం ఉంటడం వాతావారణ మార్పులను ఎదుర్కొనే విషయంలో భారతదేశ పాత్ర, సహకారం ప్రాముఖ్యాన్ని తెలియచెబుతోంది.

మోదీ ప్రసంగం అనంతరం జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మార్కెల్​ మాట్లాడతారు.

ఇదీ చూడండి: 'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్​కు పంపండి'

Last Updated : Oct 1, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details