తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఏశాట్​ ప్రయోగంతో ఐఎస్​ఎస్​కు ముప్పు!​' - ఐఎస్​ఎస్

భారత్​ ఇటీవల చేపట్టిన ఏశాట్​ క్షిపణి ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తీవ్రంగా స్పందించింది. ఈ ప్రయోగం వల్ల కక్ష్యలో సుమారు 4 వందల శిథిలాలు ఏర్పడ్డాయని పేర్కొంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించింది.

ఏశాట్​ ప్రయోగంతో ప్రమాదంలో ఐఎస్​ఎస్

By

Published : Apr 2, 2019, 11:04 AM IST

ఏశాట్​ ప్రయోగంతో ప్రమాదంలో ఐఎస్​ఎస్: నాసా
భారత్ మిషన్​ శక్తి ప్రయోగాన్ని అగ్రరాజ్యం తప్పుబట్టింది. ఏశాట్​ క్షిపణి ప్రయోగాన్ని అత్యంత భయంకర విషయంగా పేర్కొంది అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా. భారత్​ ఉపగ్రహాన్ని ధ్వంసం చేయటం వల్ల అంతరిక్షంలో సుమారు 4 వందల శిథిలాలు ఏర్పడ్డాయని తెలిపింది. దీని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​) మరింత ప్రమాదంలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటి వరకు 60 శిథిలాలను గుర్తించినట్లు నాసా పాలనాధికారి జిమ్ బ్రైడెన్​స్టైన్​ తెలిపారు. అందులో 24 శిథిలాల భాగాలు అంతరిక్ష కేంద్రం అగ్రభాగానికి సమీపంలో ఉన్నట్లు తెలిపారు.

"ఇది భయంకరమైన విషయం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అగ్రభాగానికి సమీపంలో శిథిలాలు చేరటం వల్ల భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి చర్యలు భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయోగాలకు అనుకూలం కాదు. ఏం జరుగుతుందో చూడాలి. గత వారం భారత్​ చేపట్టిన ఏశాట్​ ప్రయోగంతో సుమారు 4 వందల శిథిలాలు ఏర్పడ్డాయి." -జిమ్​ బ్రైడెన్​స్టైన్, నాసా పాలనాధికారి

శిథిలాల్లో అన్నీ గుర్తించదగినంత పెద్దవిగా లేవన్నారు జిమ్​. ప్రస్తుతం నాసా కనీసం 10 సెంటీమీటర్లు, అంతకన్నా పెద్దవిగా ఉన్న శిథిలాల సమాచారాన్నే సేకరిస్తోందన్నారు. ఇతర దేశాలూ భారత్​ తరహాలో ప్రయోగాలు చేపడితే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ప్రమాద స్థాయి పెరుగుతుందని హెచ్చరించారు. ఇది ఆమోదించదగిన విషయం కాదని, ఈ ప్రయోగాల వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు.

ఏశాట్​ ప్రయోగంతో ఏర్పడ్డ శిథిలాల మూలంగా కేవలం 10 రోజుల్లోనే అంతరిక్ష కేంద్రంలో సుమారు 44 శాతం ప్రమాద స్థాయి పెరిగిందని నాసా నిపుణులు అంచనా వేశారని జిమ్​ తెలిపారు. 2007లో చైనా చేపట్టిన ప్రయోగంతో ఏర్పడిన శిథిలాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details