తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్ష రేసు నుంచి కమలా హారిస్​ వెనక్కి

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి భారత సంతతికి చెందిన కమలా హారిస్​ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల బరిలో లేనప్పటికీ.. ప్రజలకోసం పోరాడుతూనే ఉంటానని ఆమె పేర్కొన్నారు.

KAMALA
కమలా హారిస్​

By

Published : Dec 4, 2019, 5:38 AM IST

Updated : Dec 4, 2019, 12:17 PM IST

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె మంగళవారంతో ముగించారు.

కమలా హారిస్​ ట్వీట్​

"నా మద్దతుదారులకు ఇది చాలా విచారకరం. ఈ రోజు నేను నా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాను. కానీ మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను."

-కమలా హారిస్​, డెమోక్రటిక్‌ అభ్యర్థి

తను తీసుకున్న నిర్ణయం చాలా కష్టతరమైనదని కమలా హారిస్​ పేర్కొన్నారు. అంతకు ముందు మంగళవారం ఉదయం తన సీనియర్‌ సిబ్బందికి ఈ నిర్ణయం గురించి తెలిపారామె. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీలో కీలక నేతగా మారిన కమలా హారిస్​ ఒకానొక సమయంలో అధ్యక్ష పదవికి ప్రముఖ పోటీదారుగా నిలిచారు. అయితే అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి ఆర్థిక ఒత్తిళ్లు దారితీశాయని ఆమె చెప్పుకొచ్చారు.

'నేను బిలియనీర్‌ను కాదు. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చే పరిస్థితుల్లో లేను. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ, మనం పోటీ పడటానికి అవసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని' అని ఆమె తన మద్దతుదారులకు తెలిపారు. సెనేటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్‌ చరిత్రకెక్కారు.

ఇదీ చూడండి:అమెరికా రోడ్లపై పరుచుకున్న మంచుదుప్పటి

Last Updated : Dec 4, 2019, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details