ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఎగ్జిక్యూటివ్ బోర్డుకు (UNESCO India 2021) భారత్ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికిగానూ.. జరిగిన ఎన్నికల్లో(UNESCO executive board elections 2021) 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్‌లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది.
దీనిపై ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందాన్ని ప్రశంసించారు. భారత్ అభ్యర్థిత్వానికి కృషి చేసిన దేశాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర సాంస్కృతిక, విదేశాంగ శాఖల సహాయ మంత్రి మీనాక్షి లేఖి.