తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 9:39 AM IST

ETV Bharat / international

'సీఏఏ, ఎన్​ఆర్​సీతో భారతీయ ముస్లింలపై ప్రభావం!'

పౌరసత్వ చట్ట సవరణ, ఎన్​ఆర్​సీతో ముస్లింలపై ప్రభావం పడే అవకాశం ఉందని అమెరికాలోని కాంగ్రెషనల్ రీసర్చ్​ సర్వీస్​(సీఆర్​ఎస్​) అభిప్రాయపడింది. స్వతంత్ర భారతంలో పౌరసత్వం కల్పించేందుకు మతం ప్రాతిపదిక కావటం ఇదే తొలిసారని తన నివేదికలో పేర్కొంది.

US-INDIA-CITIZENSHIP
US-INDIA-CITIZENSHIP

భారత్​లో ఇటీవల జరిగిన పరిణామాలపై కీలక అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ ఓ నివేదిక రూపొందించింది అమెరికాలోని కాంగ్రెషనల్​ రీసర్చ్ సర్వీస్(సీఆర్​ఎస్​). పౌరసత్వ చట్ట సవరణ, ఎన్​ఆర్​సీ ద్వారా భారతీయ ముస్లింలపై ప్రభావం పడుతుందని విశ్లేషించింది. సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించేందుకు కొన్ని దేశాలు, మతాలను మాత్రమే ఎంపిక చేసిన తీరుపైనా అనుమానాలు లేవెనత్తింది సీఆర్​ఎస్​.

"భారత్​ ప్రభుత్వం ఎన్​ఆర్​సీని ప్రతిపాదిస్తోంది. దీనితో పాటు సీఏఏ కూడా తోడవటం దేశంలోని ముస్లింల స్థితిపై ప్రభావం చూపుతుంది. పౌరసత్వ చట్టం-1955 ద్వారా అక్రమంగా వచ్చిన వలస వచ్చినవారికి పౌరసత్వం కల్పించలేదు. ఆ తర్వాత ఎన్నో సవరణలు జరిగినా మత ప్రాదిపదికన జరగలేదు."

-కాంగ్రెషనల్​ రీసర్చ్ సర్వీస్​

సీఆర్​ఎస్​ అనేది అమెరికా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని స్వతంత్ర పరిశోధన విభాగం. దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చట్ట సభ్యులకు నివేదికలు అందిస్తుంది. అయితే ఇవి అమెరికా కాంగ్రెస్ అధికారిక అభిప్రాయాలు కావు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

ABOUT THE AUTHOR

...view details