చైనాకు చెందిన టెలికం సంస్థ హూవావే-అమెరికా ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా చల్లారలేదు. ప్రభుత్వ సంస్థలు హువావే ఉత్పత్తులు కొనకూడదని ఇటీవల ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ సంస్థ. అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెక్సాస్ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది.
ఏం జరిగింది?:
హువావే సంస్థ చైనాకు గూఢచారిలా పనిచేస్తోందని, అందుకే ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ సర్కారు ప్రకటించింది. 2019 అమెరికా రక్షణ బిల్లు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధారాలున్నాయా?:
హువావే మాత్రం అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది.
అమెరికా ఆరోపణలు చేస్తోంది తప్ప సాక్ష్యాలు చూపించటం లేదు. దీనిపై మేము న్యాయ పోరాటానికి సిద్ధం. అమెరికా ప్రభుత్వం నిందలతో సంస్థపై బురద జల్లుతోంది. అమెరికానే మా మెయిల్స్, సర్వీస్ కోడ్స్ హ్యాక్ చేసింది - గు పింగ్, హువావే సంస్థ ఛైర్మన్