ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో లక్షా 43 వేలు, బ్రెజిల్లో 80 వేలు, బ్రిటన్లో 45 వేలు, మెక్సికోలో 40 వేలు, ఇటలీలో 35 వేల మంది చొప్పున మరణించారు.
కరోనా మరణ మృదగం... బ్రెజిల్లో 80 వేల మంది మృతి
By
Published : Jul 21, 2020, 7:54 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల కేసులు బయటపడ్డాయి. దీంతో అన్ని దేశాల్లో కలిపి కోటీ 48 లక్షల 50 వేల మందికి కరోనా సోకగా, 6 లక్షల 13 వేల మంది మృతి చెందారు. 89 లక్షల మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
అమెరికాలో 63 వేల కేసులు
అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పడటం లేదు. తాజాగా 62,879 కేసులను గుర్తించగా.. 40 లక్షలకు చేరువలో బాధితులు ఉన్నారు. 1,43,834 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 లక్షల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
80 వేల మంది మృతి..
బ్రెజిల్నూ వైరస్ వదలటం లేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి 21,21,645 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 80 వేల మంది మృతి చెందారు.
దక్షిణాఫ్రికాలో నూతనంగా 9 వేలు, మెక్సికోలో 5 వేలు, పెరూలో 4 వేలు, చిలీ, సౌదీ అరేబియాల్లో 2 వేల మందికి వైరస్ సోకినట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు.