అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హాజరుకానున్నారు. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమానికి బుష్ తన భార్య అమెరికా మాజీ మొదటి మహిళ లారా బుష్తో సమేతంగా విచ్చేస్తారని బుష్ ప్రతినిధి తెలిపారు. బుష్ పాల్గొననున్న 8వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇది. అంతకుముందు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. ప్రమాణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
అధికార బదిలీకీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ససేమిరా అంటున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత అయిన బుష్.. ఈ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొననుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జార్జి డబ్ల్యూ బుష్ హాయాంలో విదేశీ వ్యవహారాల కమిటీకీ ఛైర్మన్గా ఉన్న బైడెన్.. భారత్తో అమెరికా కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందానికి మద్దతు తెలిపారు.
మొదటిసారి హాజరు కాలేకపోతున్న జిమ్మీ కార్టర్..