తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడాలో వరద బీభత్సం- అత్యవసర పరిస్థితి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కెనడాలోని పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైనిక దళాలు రంగంలోకి దిగాయి.

కెనడాను ముంచెత్తిన వరదలు

By

Published : Apr 22, 2019, 1:44 PM IST

Updated : Apr 22, 2019, 2:55 PM IST

కెనడాలో వరద బీభత్సం- అత్యవసర పరిస్థితి

కెనడాలోని క్యూబెక్, ఆంటేరియో రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకుని 70 ఏళ్లు పైబడిన వ్యక్తి మరణించారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం 600 మంది సైనికులను రంగంలోకి దింపింది. వీరు సుమారు 1500 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఇసుక సంచులు అడ్డువేసి ఇళ్లను, ఆస్తులను రక్షించుకోవడం కోసం స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి: శ్రీలంకలో మరో బాంబు నిర్వీర్యం- భయంతో జనం

Last Updated : Apr 22, 2019, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details