తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా వాషింగ్టన్​లో వరుస భూకంపాలు

అమెరికా వాషింగ్టన్​లో వరుస భూకంపాలు సంభవించాయి. రిక్టార్​ స్కేలుపై 4.6, 3.5 తీవ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

అమెరికా వాషింగ్టన్​లో వరుస భూకంపాలు

By

Published : Jul 12, 2019, 9:10 PM IST

కొద్ది రోజులుగా అమెరికాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్​లోని రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని త్రీ లేక్స్​ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు ప్రకటించారు.

అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మొన్​రోయీ నగరం సమీపంలో 3.5 తీవ్రతతో భూమి కంపించింది.

స్థానిక కాలమానం ప్రకారం మొదటగా శుక్రవారం తెల్లవారుజామున 2.51 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

భయాందోళనలో ప్రజలు...

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వారం రోజుల క్రితం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుసగా రెండు రోజులు భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదే గత 20 ఏళ్లలోనే అతిపెద్ద భూకంపమని అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: అమెరికాలో 20 ఏళ్లలోనే అతిపెద్ద భూకంపం

ABOUT THE AUTHOR

...view details