వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ ఛోక్సీ.. భారతీయుడు అని సంబోధించారు డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ స్కెర్రిట్. ఛోక్సీ భవిష్యత్తేంటో కోర్టులు తేలుస్తాయని వ్యాఖ్యానించారు. బెయిల్ కోసం వేచిచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఛోక్సీ హక్కులకు ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం.. ఛోక్సీని భారత్కు పంపించాలన్న పిటిషన్పై విచారణను డొమినికా కోర్టు వాయిదా వేసింది. దీంతో ఛోక్సీకి తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
"భారతీయ పౌరుడి విషయం కోర్టులో ఉంది. ఆయన భవిష్యత్తు ఏమిటో కోర్టులే చెబుతాయి. దీనిపై విచారణ త్వరగా జరిగేలా చూస్తాం. ఆయన హక్కులకు ప్రాధాన్యం ఇస్తాం. దీనిపై ఆంటిగ్వాలో ఏం జరుగుతుందో, భారత్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి మాకు లేదు."
--రూజ్వెల్ట్ స్కెర్రిట్, డొమినికా ప్రధాని.