తెలంగాణ

telangana

ETV Bharat / international

అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

జార్జియాలోని ఓ కార్యక్రమానికి హూందాగా, అందంగా తయారయ్యి వచ్చారు పోటీదారులు. వారంతా ఎవరనుకుంటున్నారు? మనుషులు కాదు.. పెంపుడు కుక్కలు. కార్టూన్​ గెటప్​లు, సినిమా పాత్రలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్​ కల్చర్​ దుస్తులతో ముస్తాబయ్యాయా శునకాలు. ప్రదర్శనలో దర్జాగా పాల్గొన్నాయి.

అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

By

Published : Aug 18, 2019, 10:31 PM IST

Updated : Sep 27, 2019, 11:01 AM IST

అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

జార్జియా రాజధాని అట్లాంటాలో డాగ్​ కాన్​ కన్​వెన్షన్​ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్​తో నగరంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. వందలాది కుక్కలు ప్రత్యేక అలంకరణ దుస్తుల్లో ముస్తాబై వాటి యజమానులతో కలిసి ఇక్కడికి వచ్చాయి. అట్లాంటాలోని డౌన్​టౌన్ వుడ్రఫ్​ పార్కు ఈ ప్రదర్శనకు వేదికైంది.

శునకాలు ముస్తాబైన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. వీడియో గేమ్​లలో ఉన్న కల్పిత పాత్రల గెటప్​లు, సినిమాలోని పాత్రలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్​ కల్చర్​ దుస్తులను ధరించి ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో అందంగా తయారైన కుక్కలకు బహుమతులు అందజేశారు.

త్వరలో రాబోయే డ్రాగన్​ కాన్​ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 30 ఏళ్ల నుంచి డ్రాగన్​ కాన్​ ఈవెంట్ వేలాది మందిని ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి:-దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం!

Last Updated : Sep 27, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details