తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ బెదిరింపులు.. రాజకీయ హింసకు ప్రతీక'

తమ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేయడంపై చైనా మండిపడింది. ట్రంప్ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితంగా ఉన్నాయని విమర్శించింది. ఆయన పాలన మెకార్తి శకాన్ని తలపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

China slams Trump for threatening to slap sanctions on Chinese students
ట్రంప్ బెదిరింపులు జాత్యంహకారపూరితంగా ఉన్నాయి

By

Published : May 30, 2020, 5:48 AM IST

అమెరికాలోని తమ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ హెచ్చరించడంపై చైనా మండిపడింది. ఇది జాత్యంహకారానికి, రాజకీయ హింసకు ప్రతీక అని; ట్రంప్ పాలన మెకార్తి శకాన్ని గుర్తు చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించింది.

కరోనా సంక్షోభానికి చైనానే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే హాంకాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, వాణిజ్య ఉద్రిక్తతలను కారణమవుతోందని విమర్శిస్తోంది.

ఈ నేపథ్యంలోనే అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న వేలాది మంచి చైనా విద్యార్థులను బహిష్కరించేందుకు ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కొంత మంది చైనా అధికారులపైనా ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

త్వరలోనే నిర్ణయం!

పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ లేదా చైనా నిఘా సంస్థతో సంబంధం ఉన్న విద్యాసంస్థలకు చెందిన చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం వద్ద ఓ ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై ఓ ప్రకటన చేస్తామని ట్రంప్ తెలిపారు.

ఇది ఉదారవాదానికి వ్యతిరేకం

చైనా విద్యార్థులపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆలోచనను చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ఉదారవాదానికి వ్యతిరేకమని విమర్శించింది. అమెరికన్లలో ఇంకిపోయిన ప్రచ్ఛన్న యుద్ధ భావనలకు ఇది నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మెకార్తియిజం అంటే సరైన ఆధారాలు లేకున్నా.. అణచివేత, రాజద్రోహం ఆరోపణలు చేయడం.

ఇదీ చూడండి:ఇకపై ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్​జీ గ్యాస్​!

ABOUT THE AUTHOR

...view details