నీటి ప్రవాహం వల్ల ఓ ఇల్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కుండపోత వర్షాల వల్ల నదులు పొంగిపొరలుతున్నాయి.
హెలీకాఫ్టర్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. నగరాల్లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. కార్లు నీటిపై తేలుతున్నాయి. రవాణా స్తంభించిపోయింది.