అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారం చేపట్టిన తొలిరోజే వలసదారులకు సంబంధించి కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా... వలసదారులకు సులువుగా పౌరసత్వం కల్పించే విధంగా బిల్లు ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే కోటి పది లక్షల మంది వలసదారుల లబ్ధిపొందుతారు.
బిల్లులో ఏముంది..
ప్రతిపాదిత బిల్లు ప్రకారం అక్రమ వలసదారులకు 8 ఏళ్లలో చట్టబద్ధత కల్పించడం సహా పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జనవరి 1 వరకు ఉన్న అక్రమ వలసదారులకు ఐదేళ్లకు తాత్కాలిక చట్టబద్ధతను కల్పిస్తారు. ఆ తర్వాత మూడేళ్లకు వారికి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ చర్యతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కఠిన నియమాల నుంచి వలసదారులకు విముక్తి కలుగుతుంది.
అమెరికా అధ్యక్షునిగా బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉంది. పలు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షలనూ బైడెన్ తొలగించే అవకాశం ఉంది.
సవాళ్ల సవారీకి సిద్ధం!