తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ డ్రోన్​ దాడి వెనకున్నది ఇరానే: అమెరికా

సౌదీ ఆరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు ఇరాన్ భూభాగం నుంచే జరిగాయని ఆమెరికా తేల్చిచెబుతోంది. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. యెమెన్ తిరుగుబాటుదారులు ఈ దాడికి బాధ్యత వహిస్తుండగా.. తమపై యుద్ధానికి కాలుదువ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది.

By

Published : Sep 18, 2019, 6:03 AM IST

Updated : Oct 1, 2019, 12:41 AM IST

సౌదీలో డ్రోన్​ దాడి వెనకున్నది ఇరానే: అమెరికా

సౌదీ డ్రోన్​ దాడి వెనకున్నది ఇరానే: అమెరికా

సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన దాడి ఇరాన్​ భూభాగం నుంచే జరిగిందని అమెరికా తేల్చిచెప్పింది. ఈ దాడిలో క్రూయిజ్ క్షిపణులు వాడినట్లు పేర్కొంది.

"చమురు క్షేత్రాలపై జరిగిన దాడి గురించి అమెరికా మరిన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తోంది. వీటిని వచ్చేవారం జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో.. అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా యూరోపియన్ మిత్రదేశాలకు అందించనుంది"- ఓ అమెరికా అధికారి

సౌదీ పర్యటనకు పాంపియో..

సౌదీ చమురు క్షేత్రాలపై దాడి జరిగిన నేపథ్యంలో... అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో సౌదీలో పర్యటించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్​ ఈ మేరకు ప్రకటించారు. డ్రోన్​ దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు అమెరికా భావిస్తోందని ఆయన తెలిపారు. మిత్ర దేశాలను రక్షించుకోవడానికి యుద్ధానికైనా అమెరికా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.

"అధ్యక్షుడు ట్రంప్​ చెప్పినట్లుగా, మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదు. కానీ యుద్ధమే వస్తే అందుకు అమెరికా సిద్ధంగా ఉంది."

- మైక్​ పెన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడిని కలిసేది లేదు..

వచ్చేవారం జరిగే ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీతో భేటీ కావడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పష్టం చేశారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరాన్​- అమెరికా అణుఒప్పందం నుంచి యూఎస్​ వైదొలిగింది. అనంతరం ఇరాన్​పై కఠినమైన ఆంక్షలు విధించింది శ్వేతసౌధం​. అప్పటి నుంచి జరుగుతున్న వివిధ పరిణామాలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

తప్పు మామీద తోయద్దు...

చమురు క్షేత్రాలపై దాడికి పాల్పడింది తామేనని యెమెన్ హుతీ రెబల్స్​ ప్రకటించినప్పటికీ అమెరికా... తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఇరాన్ విదేశాంగమంత్రి మొహమ్మద్ జావెద్​ జారిఫ్​ పేర్కొన్నారు.

పునరుద్ధరిస్తాం..

సెప్టెంబర్​ చివరినాటికి ఆరాంకోలో... చమురు ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది.

"మీ కోసం ఓ శుభవార్త. ఈ నెల చివరి నాటికి చమురు ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంటుంది. "- ప్రిన్స్​ అబ్దులజీజ్ బిన్ సాల్మాన్​, ఇంధన మంత్రి​

ఇదీ చూడండి:ఈపీఎఫ్​ఓ చందాదార్లకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు

Last Updated : Oct 1, 2019, 12:41 AM IST

ABOUT THE AUTHOR

...view details