తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్షంలో సిమెంట్​ మిక్స్​ చేసిన వ్యోమగాములు!

అంతరిక్షంలో రేడియోషన్​, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మనుషులను రక్షించేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలిసారి సిమెంట్​ను మిక్స్​ చేశారు వ్యోమగాములు. ఈ ప్రయోగాన్ని మైక్రోగ్రావిటీ ఇన్వెస్టిగేషన్​ సిమెంట్​ సాలిడిఫికేషన్​గా నాసా పేర్కొంది.

అంతరిక్షంలో తొలిసారి సిమెంట్​ మిక్స్​ చేసిన వ్యోమగాములు

By

Published : Sep 12, 2019, 6:49 PM IST

Updated : Sep 30, 2019, 9:12 AM IST

అంతరిక్షంలో రేడియేషన్‌, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మనుషులను రక్షించేందుకు మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో వ్యోమగాములు తొలి సారి భార రహిత స్థితిలో విజయవంతంగా సిమెంట్‌ను మిక్స్ చేశారు.

భార రహిత స్థితి ఉన్నప్పుడు సిమెంట్‌ గట్టిపడే ప్రక్రియలో రసాయన, మైక్రోస్కోపిక్‌ నిర్మాణాలు ఎలా ఉంటాయో పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఈ ప్రయోగాన్ని మైక్రోగ్రావిటీ ఇన్వెస్టిగేషన్ సిమెంట్ సాలిడిఫికేషన్ (ఎమ్​ఐసీఎస్​)గా నాసా పిలుస్తోంది. భూమి గురుత్వాకర్షణకు వెలుపల ట్రైకాల్సియమ్ సిలికేట్‌ను, నీరుతో కలపడం ఇదే తొలిసారని పేర్కొంది. చంద్రుడు, అంగారకుడిపైకిమనుషులువెళ్లినప్పుడు అక్కడ సురక్షితంగా పనిచేసుకునేందుకు తగిన నిర్మాణాలను చేపట్టేందుకు ఈ సిమెంట్ ఉపకరిస్తుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:పీఓకేలో... కశ్మీర్​పై ఇమ్రాన్​ఖాన్ 'విధాన ప్రకటన'

Last Updated : Sep 30, 2019, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details