తెలంగాణ

telangana

ETV Bharat / international

లైట్​ వేసుకుని పడుకుంటే లావైపోతారు! - ఊబకాయం

రాత్రిపూట వెలుతురు ఉన్న గదిలో నిద్రించే మహిళలు ఊబకాయం బారిన పడుతున్నారని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. టీవీ, కంప్యూటర్​ల నుంచి వచ్చే కృత్రిమ వెలుతురు వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

లైట్​ వేసుకుని పడుకుంటే లావైపోతారు!

By

Published : Jun 11, 2019, 6:02 PM IST

కొందరు లైట్​ వేసుకునే కునుకు తీస్తారు. మరికొందరు టీవీ, ల్యాప్​టాప్​ ఆఫ్​ చేయకుండానే నిద్రలోకి జారుకుంటారు. అలా చేస్తే లావైపోతారని అంటున్నారు పరిశోధకులు. ఈ సమస్య మహిళలకే ఎక్కువని చెబుతూ అమెరికన్​ మెడికల్​ ఆసోసియేషన్​ జర్నల్​లో ఓ వ్యాసం ప్రచురితమైంది.

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ 37-74 మధ్య వయస్సు గల 43,722 మంది మహిళలపై పరిశోధన జరిపింది. వీరిలో ఎవరికీ గతంలో క్యాన్సర్​, హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు లేవు. రాత్రివేళ ఉద్యోగం చేసిన వారు కాదు. పగలు నిద్రించే వారు కాదు. ఐదేళ్లపాటు నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళల బరువు,ఎత్తు, బీఎంఐ వివరాలు తరచూ సేకరించారు.

టీవీ, ల్యాప్​టాప్​ల నుంచి వచ్చే కృత్రిమ వెలుతురు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేసి, ఊబకాయానికి దారితీస్తుందని నిర్ధరించారు.

వెలుతురు బట్టి బరువు....

చీకటి గదిలో నిద్రించే మహిళలతో పోల్చితే... కృత్రిమ వెలుతురు ఉన్న గదిలో పడుకునేవారిలో బరువు పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. వెలుతురు తీవ్రతను బట్టి ఈ మార్పు ఉందని తేల్చారు. చిన్న బెడ్​లైట్​ ఆన్​ చేసుకుని నిద్రించినవారి బరువులో ఎలాంటి మార్పు లేదు. పెద్ద లైటు లేదా టీవీ ఆన్​ చేసుకుని నిద్రించినవారిలో 17శాతం మంది మహిళల బరువు 5 కిలోలు పెరిగినట్లు పరిశోధకులు లెక్కగట్టారు.

ఊబకాయం గురించి వివరిస్తున్న పరిశోధకురాలు

"టీవీనుంచి వచ్చే వెలుతురులో నిద్రించే మహిళలు కాలక్రమేణా బరువు పెరుగుతున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ మహిళ ఐదు కేజీల బరువు పెరిగింది. బెడ్​లైట్ ద్వారా వచ్చే వెలుతురుతో బరువు పెరిగే అవకాశాలు లేవని తేలింది. రాత్రివేళ సరైన నిద్ర చాలా ముఖ్యం. ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే పడుకునే ముందు గదిలో వెలుతురు లేకుండా లైట్లు ఆఫ్​ చేసుకోవడం మంచిది."
-డేల్ సాండ్లర్​, పరిశోధకురాలు.

నిద్రలేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. రాత్రివేళ తప్పనిసరిగా సరైన నిద్ర అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: యాపిల్​, గూగుల్​ను వెనక్కు నెట్టేసిన అమెజాన్

ABOUT THE AUTHOR

...view details